IPL 2026: ఉత్కంఠ పోరులో లక్నో ఘన విజయం.. హోంగ్రౌండ్లో మళ్లీ ఓడిన కేకేఆర్

IPL 2026: ఉత్కంఠ పోరులో లక్నో ఘన విజయం.. హోంగ్రౌండ్లో మళ్లీ ఓడిన కేకేఆర్

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. కాగా టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టుకి ఆశించిన ఆరంభం లభించలేదు.. 15 పరుగుల వద్ద ఓపెననర్ ఫిన్ అలెన్ (9) ఔట్ అయ్యాడు. అనంతరం రహానే– రఘువంశీ నెలకొల్పిన 84 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్నికి బ్రేక్ పడింది. 99 పరుగుల వద్ద రహానే (41) డగౌట్ కి వెళ్లగా, ఆ తర్వాత రఘువంశీ (45), రింకు సింగ్ (4) వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టారు. కానీ చివర్లో  రోవ్‌మన్ పావెల్ (39),  కామెరూన్ గ్రీన్ మరో 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల చేసింది కేకేఆర్.

182 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆటగాడు ఆయూష్ బదోనీ, ముకుల్ చౌదరీ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అంతకుముందు, లక్నో ఓపెనర్లు  ఐడెన్ మార్క్రమ్– మిచెల్ మార్చ్ జోడి మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి మధ్య నెలకొన్న 41 పరుగుల పార్ట్నర్ షిప్ ని వైభవ్ ఆరోరా బ్రేక్ చేశాడు. మార్చ్ (15)కి సంధించిన ఓ సూపర్బ్ బంతిని ఆడే క్రమంలో కీపర్ రఘువంశీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే మార్క్రమ్ (22) బ్యాటింగ్ లో స్పీడ్ పెంచే క్రమంలో వైభవ్ ఆరోరా బౌలింగ్ లో భారీ షాట్ ఆడగా ఆది నేరుగా బౌండరీ లైన్ వద్ద ఉన్న రోవ్‌మన్ పావెల్ చేతిలో పడటంతో అతడు క్రీజు నుంచి వెనుదిరిగాడు. ఇక మైదానంలోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి విఫలమయ్యారు. కేవలం 10 పరుగులు మాత్రమే చేసి కామెరూన్ గ్రీన్ బౌలింగ్ లో పంత్ డగౌట్ కి వెళ్లిపోయాడు. 

Also Read : రఫ్పాడించిన రఘువంశీ, రోవ్‌మన్, రహానే..

అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన నికోలస్ పూరన్ మరోసారి తీవ్ర నిరాశ పరిచాడు. కేవలం 13 పరుగులు చేసి కార్తిక్ త్యాగి బౌలింగ్ లో రమణ్ దీప్ సింగ్ కి క్యాచి ఇచ్చి పూరన్ పెవిలియన్ కి వెళ్లిపోయాడు.  ఆ తర్వాత వచ్చిన అబ్దుల్ సమద్ (2) సైతం పెద్దగా రాణించలేదు.. అనుకూల్ రాయ్ వేసిన ఓ కిరాక్ బంతికి క్లిన్ బౌల్డ్ అయ్యాడు. వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ ఆయూష్ బదోనీ ( 34 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సులతో 54 పరుగులు) మాత్రం హాఫ్ సెంచరీ చేసి జట్టుని గెలుపు దిశగా నడిపిస్తున్న క్రమంలో అనుకూల్ రాయ్ బౌలింగ్ లో రింకు సింగ్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన మహ్మద్ షమీ (1)ని సునీల్ నరైన్ ఔట్ చేశాడు. చివర్లో బ్యాటింగ్ కి వచ్చిన ముకుల్ చౌదరి చెలరేగిపోయాడు. కేవలం 27 బంతుల్లోనే సూపర్బ్ (54 నాటౌట్) అర్థ శతకం బాదేశాడు. ముకుల్ ఇన్సింగ్స్ లో ఏకంగా 7 సిక్సులు 2 ఫోర్లు ఉన్నాయి. ముకుల్ బ్యాటింగ్ దెబ్బకి కేకేఆర్ చిత్తుగా ఓడిపోయింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, అనుకూల్ రాయ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి, కామెరాన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.